సునీల్ రెడ్డి ఇంట్లో సిబిఐ సోదాలు, ముగిసిన కస్టడీ

కాగా, బెయిల్ కోసం ఐఎఎస్ అధికారి బిపి ఆచార్య పెట్టుకున్న పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. తన నిర్ణయాన్ని కోర్టు ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో ప్రథమ ముద్దాయి అని బిపి ఆచార్యను సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మార్ కేసులో అరెస్ట్ అయిన కోనేరు ప్రసాద్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. దీనిపై సోమవారం విచారణ జరిపిన నాంపల్లి ప్రత్యేక సీబీఐ కోర్టు తదుపరి విచారణను 9వ తేదీకి వాయిదా వేసింది. తాము చాలా మంది ఐఎఎస్ అధికారులను విచారించామని, కేసులతో సంబంధం ఉన్నవారిని మాత్రమే అరెస్టు చేశామని సిబిఐ సోమవారం వివరణ ఇచ్చింది. తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని విజయ రాఘవ వేసిన పిటిషన్‌పై విచారణను కోర్టు 9వ తేదికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications