విస్తరణలో మంత్రి పదవులు దక్కే ముగ్గురు ఎవరు?

కాగా, సీనియర్ శాసనసభ్యుడు పి.కిష్టారెడ్డి (నారాయణఖేడ్)కి స్థానం దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. సీమాంధ్రలో కూడా ఒకరిద్దరు చేరే అవకాశాలు లేకపోలేదని, ముఖ్యమంత్రికి ఈ విషయంలో హైకమాండ్ స్వేచ్ఛనిచ్చిందని కూడా ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు అంటున్నాయి. అయితే.. సోనియాను కలిసిన తరువాత ఆశావహులు కొందరితో ముఖ్యమంత్రి మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి మీకు అవకాశం లేదని ఆయన సీమాంధ్ర నేతలకు స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ప్రస్తుత విస్తరణలో సీమాంధ్ర వారికి స్థానం ఉండకపోవచ్చునని తెలుస్తోంది.
కిరణ్‌కుమార్ రెడ్డికి శనివారం ఐదు నిమిషాల సమయం మాత్రమే ఇచ్చిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం మాత్రం గంట సమయం కేటాయించారు. సోనియా గాంధీ, గులాంనబీ ఆజాద్, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్‌తోనూ కిరణ్ దాదాపు గంట సేపు మంతనాలు జరిపారు. సోనియాను కలిసిన తర్వాత ముఖ్యమంత్రి ఉల్లాసంగా కనిపించారు. కొద్ది సేపు టెన్ జనపథ్ బయట ఆజాద్, అహ్మద్‌పటేల్‌లతో మంతనాలు జరిపారు.












Click it and Unblock the Notifications