హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ప్లాన్: వైయస్ మంత్రులపైకి మళ్లింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: సిబిఐ దర్యాప్తు విషయంలో ఐఎఎస్ అధికారులకు, రాజకీయ నాయకులకు మధ్య ఏర్పడిన యుద్ధవాతావరణాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రి వర్గంలో పనిచేసి, ఇప్పుడు తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మంత్రులపైకి సిబిఐ దర్యాప్తును మళ్లించే యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, ఆయన వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యులు మాట్లాడుతున్న తీరు ఆ విషయాన్ని పట్టిస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషించిన ఐఎఎస్ అధికారులను సిబిఐ కొంత మందిని అరెస్టు చేయడం, మరికొంత మందిని విచారిస్తుండడం వివాదంగా మారింది. ఎమ్మార్, వైయస్ జగన్, గాలి జనార్దన్ రెడ్డి కేసుల్లో సిబిఐ కొంత మంది రాజకీయ నాయకులను సాక్షులుగా విచారించింది. కానీ, వారిని నిందితులుగా చేర్చకపోవడమే కాకుండా వారిని అరెస్టు కూడా చేయడం లేదనే వాదనను బలంగా ముందుకు తెస్తున్నారు. జరిగిన పొరపాట్లకు మంత్రివర్గ సభ్యులను బాధ్యులను చేయాలనే వాదన జగన్ వర్గం నుంచి వస్తోంది.

వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రి వర్గంలో పనిచేసి ప్రస్తుతం వైయస్ జగన్ వైపు ఉన్న బాలినేని శ్రీనివాస రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ తాము విచారణకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం ద్వారా ప్రస్తుతం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో పనిచేస్తున్నవారిని ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బొత్స సత్యనారాయణ, గీతా రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి తదితర మంత్రుల పాత్ర వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్ణయాల్లో ఉందనే వాదన వినిపిస్తోంది. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో సబితా ఇంద్రారెడ్డి ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. నిర్ణయాల్లో మంత్రుల సమిష్టి బాధ్యత ఉంటుందని, అయితే దాని అమలు విషయంలో ఉండదని పిసిసి అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వంటివారు అంటున్నారు.

ఐఎఎస్ అధికారుల వాదనకు అంతగా మద్దతు లభించకపోయినప్పటికీ రాజకీయ నాయకులను వదలకూడదనే వాదనకు బలం చేకూరుతుంది. ప్రతిపక్షాలు ఈ విషయంలో బలంగానే తమ వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, ఎవరి పాత్ర ఉందనేది సిబిఐ తేలుస్తుందని కాంగ్రెసు నాయకులు అంటున్నారు. ఈ స్థితిలో పూర్తిగా సిబిఐ దర్యాప్తు తీరునే వైయస్సార్ కాంగ్రెసు నాయకులు తప్పు పడుతున్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కూడా కాంగ్రెసు పార్టీ కాపాడే ప్రయత్నం చేస్తోందని, సిబిఐ అందుకే చంద్రబాబును వదిలేస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు. ఏమైనా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వాదనలు కాస్తా గందరగోళానికి కారమవుతున్నాయి.

English summary
It seems YSR Congress party president YS Jagan is trying to shift the focus of CBI probe towards ministers worjed in YSR cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X