ఒకటి, రెండు రోజుల్లో జగన్ వర్గం ఎమ్మెల్యేలపై చర్యలు

కాగా, ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డిపై అనర్హత వేటు వేస్తే న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఎదురవుతాయా అనే మీమాంసలో స్పీకర్ పడినట్లు చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడంతో తనకు విప్ జారీ చేసే హక్కు లేదని శోభా నాగిరెడ్డి వాదిస్తున్నారు. అయితే, అదే సమయంలో ఆమె తన శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమెపై అనర్హత వేటు వేయడం కన్నా ఆమె రాజీనామాను ఆమోదించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఏమైనా, జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు భవిష్యత్తు శాసనసభా సమావేశాల లోగా తేలిపోయే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications