'తెలంగాణ' ఉద్యమ కేసులు ఎత్తివేయండి!: సిఎం ఆర్డర్

కాగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తి వేయాలని తెలంగాణవాదులు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై గతంలోనే స్పందించిన ప్రభుత్వం ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తివేసేందుకు సిద్ధమని ప్రకటించింది. అయితే న్యాయపరమైన చిక్కులు ఉన్న వాటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. ఇటీవల హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి కూడా విద్యార్థులపై కేసులు ఎత్తివేసే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. న్యాయపరమైన చిక్కులు ఉన్న వాటిపై సమయం పడుతుందన్నారు. సాధ్యమైనన్ని కేసులు ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. సుమారు 1400 కేసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటిలో ఇప్పటికే ఆరువందలకు పైగా కేసులు ఎత్తివేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆస్తుల ధ్వంసం, దోపిడీ తదితర కేసుల్లో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశముంది. ఇలాంటి కేసులు ఎత్తివేసిన పక్షంలో బాధితులకు నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారనే ప్రశ్న తలెత్తడంతో పాటు, భవిష్యత్తులో వీటిని చూపి కేసులు ఎత్తి వేయమని డిమాండ్‌లు చేసే అవకాశముంటుంది.












Click it and Unblock the Notifications