కిరణ్‌పై అటాక్: డిఎల్ చెప్పని మంత్రి ఎవరు?

మోపిదేవి వెంకటరమణతో బుధవారం ఓ టీవీ చానెల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆ మంత్రి పేరు ప్రస్తావనకు వచ్చింది. ఖమ్మం జిల్లాకు చెందిన నాయకుడి ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమం ఏర్పాట్లన్నీ నున్నా వెంకటరమణే చూశాడని ఓ వ్యక్తి మోపిదేవి వెంకటరమణతో ఫోన్‌లో మాట్లాడుతూ చెప్పారు. ఆ నాయకుడి పేరు కూడా ఆయన చెప్పారు. అయితే, దానికి తానెలా సమాధానం చెబుతానని మోపిదేవి అన్నారు. మీ కాంగ్రెసు పార్టీకి చెందిన మంత్రే కదా అని ఆ వ్యక్తి మోపిదేవితో అన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెసు రాజకీయాలతో తనకు అంతగా పరిచయం లేదని, అందువల్ల తాను ఆ విషయం ఏమీ చెప్పలేనని మోపిదేవి అన్నారు. దీన్ని బట్టి డిఎల్ రవీంద్రా రెడ్డి ఉద్దేశించి చేసిన వ్యాఖ్య ఏ మంత్రిపై చేసిందో అర్థమైపోతుందనే అభిప్రాయం వినపడుతోంది. తాము మోపిదేవి వెంకటరమణకు పది లక్షల రూపాయలు లంచం ఇచ్చామని ఎసిబి అరెస్టు చేసిన వెంకటరమణ తన వాంగ్మూలంలో చెప్పాడు. అదే ఇప్పుడు మోపిదేవి వెంకటరమణకు చుట్టుకుంది.












Click it and Unblock the Notifications