వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లిళ్లు చేసుకుని మోసం చేసే మహిళా ముఠా

By Pratap
|
Google Oneindia TeluguNews

Ahmedabad Map
అహ్మదాబాద్: అహ్మదాబాద్ నగర నేర విభాగం పోలీసులు మహిళా మ్యారేజీ రాకెట్‌ గుట్టును రట్టు చేశారు. పెళ్లి కూతుళ్లు కోసం వెంపర్లాడే అవివాహితులను వెతికి భారీ ఫీజు వసూలు చేసి నకిలీ పెళ్లి కూతుళ్లను చూపించి, ఆ తర్వాత మోసం చేసే ముఠా అది. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే నకిలీ పెళ్లి కూతురు పెళ్లి కుమారుడిని వదిలేసి ఆభరణాలను, పెళ్లి బహమతులను, నగదును ఎత్తుకెళ్లడాన్ని ఆ ముఠా పనిగా పెట్టుకుంది. ఛత్తీస్‌గడ్‌లోని రాయపూర్ (20)కు చెందిన శ్వేత మాథ్యూను, పెళ్లి కూతురు బంధువులుగా చెప్పుకునే ముంబైకి చెందిన శామా లుహార్ (25), మేరియా పెట్రాస్ (50)లను పోలీసులు అరెస్టు చేశారు. అహ్మదాబాద్‌కు చెందిన అనసూయ అమర్చందానీ (60)ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలో ఈమెనే కీలక సభ్యురాలు.

సాయిజ్పూర్‌కు చెందిన గంఢ్వీ కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు మ్యారేజీ రాకెట్ ముఠాను పోలీసులు పట్టుకోగలిగారు. ఆ కుటుంబానికి చెందిన ప్రఫుల్ ఫిబ్రవరి 3వ తేదీన పెళ్లి చేసుకుంది. శ్వేతను పెళ్లి వేడుకలో సోమవారం అరెస్టు చేశారు. శ్వేత నుంచి పోలీసులు 10 వేల రూపాయల నగదు, 70 వేల రూపాయల విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నాటకం ముగిసిందని, తాను వస్తున్నానని శ్వేత ముంబైలోని సలీంకు చెప్పిన విషయాన్ని వరుణ్ విన్నాడు. తన సిమ్ కార్డును భర్త మొబైల్‌లో వేసుకుని ఆ కాల్ చేయడం ద్వారా శ్వేత పట్టుబడింది. ఆ మొబైల్‌కు ఆటో రికార్డు సౌకర్యం ఉందనే విషయం శ్వేతకు తెలియదు.

English summary
City crime branch arrested four women in the city who were part of a marriage racket where they would target bachelors unable to find brides, offer them a girl for marriage, charging them a hefty fee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X