హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మేడారంలో గాయపడిన కెసిఆర్, 48కిలోల తులభారం

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: మేడారం జాతరలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు స్వల్పంగా గాయపడ్డారు. కెసిఆర్ గురువారంనాడు సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చారు. జాతరలో ఓ భక్తుడు విసిరిన కొబ్బరికాయ తగిలి ఆయన గాయపడ్డారు. అది అంత పెద్ద గాయమేమీ కాదని చెబుతున్నారు. ఆయన సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్నారు. సమ్మక్క, సారలమ్మకు కెసిఆర్ 48 కిలోల బంగారం (బెల్లం) సమర్పించారు. ఆయన 48 కిలోలు తూగారు. కెసిఆర్ తులాభారంలో నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకోవడాన్ని భక్తులు ఆసక్తికరంగా చూశారు.

మేడారం జాతరకు ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు వచ్చారు. దీంతో మేడారం జనసంద్రమైంది. బుధవారం సమ్మక్క, సారలమ్మ జాతరలో కీలకమైన ఘట్టం ఉంటుంది. సమ్మక్క గద్దెనెక్కుతుంది. ఇంతకు ముందు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెసు శానససభ్యుడు చిరంజీవి కూడా తులాబారం వేయించుకుని నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. జంపన్న వాగు వద్ద భక్తులు స్నానాలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదీ సతీసమేతంగా సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. జాతరకు ఏర్పాట్లు మెరుగు పడ్డాయని ఆయన చెప్పారు. జాతరకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆయన తెలిపారు.

సతీసమేతంగా సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న కెసిఆర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మళ్లీ జాతర వచ్చేనాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా జాతర నిర్వహిస్తామని ఆయన చెప్పారు. జాతర నిర్వహణకు 250 కోట్ల రూపాయలు కేటాయించి, అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

English summary
TRS president K Chandrasekhar Rao injured at Medaram jathara, as hit by coconut.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X