ప్రభుత్వం చిల్లరకొట్టు కాదు: జూడాల డిమాండ్‌పై బొత్స

జూనియర్ డాక్టర్ల స్టయిఫండ్ అంశాన్ని రాజకీయాలతో ముడిపెట్టకూడదని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాలతో మన రాష్ట్రంలోని జూనియర్ డాక్టర్లకు చెల్లిస్తున్న స్టయిఫండ్‌ను పోల్చి చూడాల్సి ఉంటుందని ఆయన అన్నారు. జూనియర్ డాక్టర్లకు ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నామని ఆయన అన్నారు. జూనియర్ డాక్టర్లు వెంటనే సమ్మె విరమిచాలని ఆయన సూచించారు. జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించాలని సూచిస్తూ శాసనమండలిలో తీర్మానం చేయాలని ఆయన అన్నారు. స్టయిఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్ల సమ్మె మంగళవారం కూడా కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications