హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భవానీతో చిరంజీవికేం సంబంధం?, రైజింగ్ స్టార్: సిఆర్సీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

C Ramachandraiah
హైదరాబాద్: భవానీ ద్వీపంతో తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవికి ఏం సంబంధమని ఆయన వర్గం దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య మంగళవారం తెలుగుదేశం పార్టీని ప్రశ్నించారు. ఆయన సిఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. భవానీ ద్వీపంతో చిరంజీవికి ఏమాత్రం సంబంధం లేదన్నారు. టిడిపి నేతలు ఉద్దేశ్య పూర్వకంగా ఆయనపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఆయన బినామీ కాదన్నారు. విమర్శలు చేస్తే ఒక అర్థముండాలని తెలుగుదేశం పార్టీ నేతలకు సూచించారు. చిరంజీవి కీర్తి ప్రతిష్టలను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎంతగా దెబ్బతీయాలని ప్రయత్నించినా అది కుదరదన్నారు. ప్రభుత్వం తప్పు చేస్తే ఎండగట్టండి కానీ వ్యక్తిగతంగా విమర్శలకు దిగవద్దన్నారు. చంద్రబాబు చేస్తే మంచి అవుతుంది ఇతరులు చేస్తే చెడు అవుతుందా అని అడిగారు. భవానీ ద్వీపంపై టిడిపిది అనవసర రాద్దాంతమన్నారు. తనకు అధికారం దక్కకుండా చిరంజీవి చేశారనే దుగ్ధతోనే బాబు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు.

ఈ అంశంలో తెలుగుదేశం పార్టీ నేతలు విజయవాడ కనకదుర్గమ్మ వారు లేదా కాణిపాకం వినాయకుడి గుడిలో ప్రమాణం చేసి విమర్శలు చేయాలని సవాల్ విసిరారు. అలా కాదంటే నోరూ మాయాలన్నారు. చిరంజీవి మెగాస్టార్ మాత్రమే కాదని రాజకీయాల్లో ఆయన రైజింగ్ స్టార్ అన్నారు. కలుషితమైన కాంగ్రెసులో తాము చేరామని ఆరోపిస్తున్న బాబు ఎక్కడి నుండి వచ్చారో చెప్పాలన్నారు. బాబు వచ్చిన తర్వాత టిడిపి కలుషితమైందన్నారు. తెలుగుదేశం పార్టీలో కాంగ్రెసులా స్వేచ్ఛ ఉండదన్నారు. అందుకే తాను టిడిపిలో ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో విభేదించినప్పటికీ బహిర్గతం చేయలేదన్నారు.

English summary
Minister C Ramachandraiah said that Tirupati MLA Chiranjeevi did not link with Bhavani island. He challenged TDP leaders about allegations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X