హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భాను కిరణ్ అనుచరుడి అరెస్టు, భూకబ్జా ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ అనుచరుడు ఆంజనేయులు గుప్తాను సిఐడి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఓ భూవివాదం కేసులో పోలీసులు అతన్ని అరెస్టు చేసినట్లు సమాచారం. మియాపూర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆంజనేయులు గుప్తాను సిఐడి అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. తనకు చెందిన 7 కోట్ల రూపాయల విలువైన భూమిని ఆంజనేయులు, భాను కిరణ్ భయపెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు అతను ఆరోపించాడు.

మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. అతని కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. మద్దెలచెర్వు సూరిని హత్య చేసిన వెంటనే అతను పారిపోయాడు. అప్పటి నుంచి అతను కనిపించడం లేదు. సూరికి కూడా తెలియకుండా భాను కిరణ్ హైదరాబాదులోనే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

English summary
CID police arrested Bhanu Kiran's follower Anjaneyulu Gupta in land grabbing case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X