మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లాకప్ డెత్‌ను మీద వేసుకోవాలంటున్నారు: కానిస్టేబుల్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

Medak Map
సంగారెడ్డి: మెదక్ జిల్లా రామచంద్రాపురం పోలీసు స్టేషన్‌లో జరిగిన లాకప్ డెత్‌ బాధ్యతను మోయాలని ఉన్నతాధికారులు తమను వేధిస్తున్నారని ముగ్గురు కానిస్టేబుల్స్ ఆరోపిస్తున్నారు. వారు ఓ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో ముఖాలకు ముసుగులు కప్పుకుని మాట్లాడారు. హైదరాబాద్ రేంజ్ డిఐజి, ఎస్పీ, అడిషనల్ ఎస్పీ తమపై ఒత్తిడి తెస్తున్నారని, వేధిస్తున్నారని వారు ఆరోపించారు. తమకు న్యాయం జరగాలని, అసలు దోషులకు శిక్ష పడాలని తాము కోరుకుంటున్నామని వారు చెప్పారు.

తాము రాత్రి విధుల్లో ఉన్నప్పటికీ మరణించిన బ్రహ్మం అనే వ్యక్తి లాకప్‌లో ఉన్నట్లు కూడా తమకు తెలియదని, అతని పేరు ఎంట్రీ బుక్కులో లేదని వారు చెప్పారు. టవల్‌తో ఉరేసుకున్న బ్రహ్మాన్ని తాము చూసి, కిందికి దించిన మాట వాస్తవమేనని, అయితే తమకు అతని మరణంతో ఏ విధమైన సంబంధం లేదని వారంటున్నారు. సిఐలు ప్రమోషన్ జాబితాలో ఉన్నందున ఇబ్బందులు వస్తాయని, వారికి ఇబ్బందులు కలగకుండా తమపై వేసుకోవాలని ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారని వారన్నారు. తమను బలిపశువులను చేయాలని చూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

మెదక్ జిల్లా రామచంద్రాపురం పోలీసు స్టేషన్‌లో బ్రహ్మం అనే వ్యక్తి మరణించాడు. పోలీసుల చిత్రహింసలకే అతను మరణించాడని అతని తరఫు బంధువులు ఆరోపించారు. వారం రోజుల క్రితం బ్రహ్మాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన కోట్లకోయిల బ్రహ్మం పటాన్‌చెరు బీరం గుడా గ్రామానికి భార్యతో కలిసి వచ్చాడు. స్థానిక శ్రీనివాస నగర్ కాలనీలో దొంగతనం చేశాడు.

English summary

 Three constables of Ramachandrapuram PS of Medak district are alleging higher official on locjup death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X