లక్ష్మినారాయణ చేతికి సోహ్రాప్ ఎన్‌కౌంటర్ కేసు

పైగా, సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసుతో ఆంధ్రప్రదేశ్ లింక్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ లింక్‌పై దర్యాప్తును వేగవంతం చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించింది. దీంతో సిబిఐ గుజరాత్ బృందం పోలీసు ఉన్నతాధికారి ఎన్ బాలసుబ్రహ్మణ్యం, ఎసిపి సిహెచ్ శ్రీనివాసరావును, మాజీ డిజిపి కె. అరవిందరావును విచారించింది. గుజరాత్ ఎటిఎస్ ఎస్పి రాజ్ కుమార్ పాండ్యన్‌కు బాలసుబ్రహ్మణ్యం సహకరించినట్లు ఆరోపణ ఉంది. హైదరాబాదులోని ఐపియస్ ఆఫీసర్స్ మెస్‌లో ఆయనకు గది కూడా బుక్ చేసినట్లు చెబుతున్నారు. సోహ్రాబ్ ఎన్‌కౌంటర్ కేసులో మరింత మంది ఐపియస్ అధికారులు లక్ష్మినారాయణ ముందు హాజరు కావాల్సి ఉంటుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications