ప్రచారం కోసమే చిరంజీవిపై బురద: టిడిపిపై కన్నబాబు

Kanna Babu
హైదరాబాద్: ప్రచారం లభిస్తుందనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు తమ నాయకుడు చిరంజీవిపై బురద చల్లుతున్నారని శానససభ్యుడు కన్నబాబు వ్యాఖ్యానించారు. భవానీ దీవిని సొంతం చేసుకున్న మంత్రి గంటా శ్రీనివాస రావు చిరంజీవికి బినామీ అని తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యానించడంపై ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. తాము కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు చాలా ఆపాదించగలమని, తమకు సంస్కారం ఉంది కాబట్టి అలా చేయడం లేదని ఆయన అన్నారు. చిరంజీవికి బినామీగా గంటా శ్రీనివాస రావు వ్యవహరిస్తున్నట్లు ఆధారాలుంటే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

భవానీ ఐలాండ్ లీజు కోసం తెలుగుదేశం పార్టీ నేత లింగమనేని రమేష్ కూడా టెండర్ వేశారని, రమేష్ అత్యధికంగా కోట్ చేసిన బిడ్డర్‌లో రెండో స్థానంలో నిలిచారని, దాంతో అది గంటా శ్రీనివాస రావుకు చెందిన ప్రత్యూష కంపెనీకి దక్కిందని ఆయన అన్నారు. లింగమనేని రమేష్‌కు కాంట్రాక్టు లభించి ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడి ఉండేవారు కారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రైవేటీకరణకు వ్యతిరేకమైతే భవానీ దీవిపై మాట్లాడాలని, అయితే వారు వ్యతిరేకం కాదని పలుసార్లు రుజువైందని అంటూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రైవేట్‌పరం చేసిన ఉదంతాలను కన్నబాబు ఉదహరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+