హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబే బహిష్కరించారు: టిఆర్ఎస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kishan Reddy-Harish Rao
హైదరాబాద్: తమను సభ నుండి బహిష్కరించడం పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు హరీష్ రావు, పోచారం శ్రీనివాస రెడ్డి శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మేము తీర్మానం ఇప్పుడే పెట్టాలని డిమాండ్ చేయడం లేదని ఎప్పుడు పెడతారో చెప్పాలని మాత్రమే అడుగుతున్నామన్నారు. తెలంగాణపై తీర్మానం పెట్టాలని ప్రతిపక్షం అడగదు అధికార పక్షం పెట్టదు కాబట్టే తాము అడ్డుకున్నామన్నారు. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రానికి మించిన ప్రధాన సమస్య లేదన్నారు. సభలో మా గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అందుకే బహిష్కరించారన్నారు. తమను సస్పెండ్ చేసింది తెలంగాణ మంత్రే కావడం, కాంగ్రెసు తెలంగాణ ఎమ్మెల్యేలు నిరసన తెలియజేయక పోవడం బాధాకరమన్నారు. మమ్మల్ని సభ నుండి సస్పెండ్ చేయవచ్చు కానీ టిడిపి, కాంగ్రెసులను తెలంగాణ ప్రజలు సస్పెండ్ చేస్తారన్నారు. ఆ పార్టీలకు ప్రజలే బుద్ది చెబుతారన్నారు. తెలంగాణ కోసం ప్రాణమిస్తామన్న జానారెడ్డి ఏంచేస్తున్నాడని ప్రశ్నించారు. స్పీకర్ ఏకపక్షంగా సస్పెండ్ చేశారన్నారు. టిడిపి, కాంగ్రెసు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని ఆరోపించారు.

తెలంగాణకు చెందిన శ్రీధర్ బాబే సస్పెండ్ తీర్మానం ప్రవేశ పెట్టడం దారుణమన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ వచ్చే వరకు పదవులు వద్దని పలికిన శ్రీధర్ ఇప్పుడు తమనే బహిష్కరించడం ఎంత వరకు సమంజసమన్నారు. ఇది చీకటి రోజు అని బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే టిడిపి, కాంగ్రెసులకు తెలంగాణ గుర్తుకు వస్తుందన్నారు. వారంతా తెలంగాణ ద్రోహులేనన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి బడ్జెట్ ప్రవేశ పెడుతూనే ఉన్నారని కానీ తెలంగాణ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. మేం పోడియం వద్దకు వెళితే టిడిపి తెలంగాణ నేతలు ఎవరూ సభలో లేరన్నారు. ఇదేమి మ్యాచ్ ఫిక్సింగో తెలపాలన్నారు. ఈ సభ తెలంగాణకు న్యాయం చేయదన్నారు. కాంగ్రెసు, టిడిపిలు తెలంగాణపై ఇచ్చిన మాట తప్పాయని బిజెపి నేతలు కిషన్ రెడ్డి, యెండల లక్ష్మీ నారాయణ అన్నారు.

English summary
TRS MLAs Harish Rao and Pocharam Srinivas Reddy accused minister Sridhar Reddy for propose suspension in Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X