హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్‌కు ఆనాడే చెప్పా, ఏ తప్పు చేయలేదు: బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: సినీ యాకర్ట్ సామాజిక న్యాయం చేస్తానని, సామాజిక తెలంగాణ తెస్తానని చెప్పి కాంగ్రెసులో కలిసిపోయారని ఆయన చిరంజీవిని ఉద్దేశించి విమర్శించారు. కాంగ్రెసు కుట్రలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసును, తెరాసను కలుపుకుని తమ పార్టీని దెబ్బ తీయాలని కాంగ్రెసు అనుకుంటోందని ఆయన అన్నారు. వైయస్ జగన్ తండ్రి వైయస్ కాంగ్రెసులో ఉండి అవినీతి సొమ్ము కూడబెట్టి ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. కేసులు పెట్టినా, బర్తరఫ్ చేసినా ఎన్టీ రామారావు వెనుదిరిగి చూడలేదని ఆయన అన్నారు. తాము ఏ తప్పూ చేయలేదని, చేతనైంది చేసుకోవాలని వైయస్సార్‌కు 2004లోనే చెప్పానని, కమిటీలు ఎన్నో వేసినా ఏమీ చేయలేకపోయారని ఆయన అన్నారు. నీతివంతమైన, సమర్థవంతమైన పాలన తమ పార్టీకే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. తెలుగు మహిళ సర్వసభ్య సమావేశంలో ఆయన శనివారంనాడు మాట్లాడారు.

తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చాయని, చాలా స్పష్టంగా చెప్పామని, తెలంగాణ సమస్యను పరిష్కరించే బాధ్యత కాంగ్రెసుపై ఉందని, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెసు అధికారంలో ఉంది ఆ సమస్యను కూడా ఆ పార్టీయే పరిష్కరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. బిజెపితో కుమ్మక్కయి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి అక్రమ మైనింగ్ లీజులు అప్పగించారని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు టెండర్‌ను నమస్తే తెలంగాణ పత్రికలో భాగస్వామి కాబట్టి ఇచ్చారని ఆయన అన్నారు. వాస్తవాలు బయట పెట్టాసలని తాము డిమాండ్ చేశారని, భయపడి టెండర్ రద్దు చేశారని, రద్దు చేసినంత మాత్రాన తప్పును కప్పిపుచ్చుకోలేరని ఆయన అన్నారు. పోలవరం టెండర్ల ఖరారులో అక్రమాలు జరిగాయని, ఫైలును స్పీకర్ ముందు పెట్టాలని ఆయన అన్నారు. అవినీతి విషయంలో రాజకీయాలు, పార్టీలు లేవని, ఇష్టానుసారంగా కలిసిపోతున్నారని ఆయన అన్నారు. తెరాస తెలుగుదేశంపై విరుచుకుపడుతోందని, వైయస్సార్ కాంగ్రెసుపై, కాంగ్రెసుపై విమర్శలు చేయడం లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయాలనుకునేవారే దెబ్బ తింటారని ఆయన అన్నారు.

మహిళలను లక్షాధికారులను చేస్తామని చెప్పి కాంగ్రెసు ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. స్త్రీలు ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ క్రెడిట్ తమ పార్టీ ఘనతేనని ఆయన చెప్పుకున్నారు. వడ్డీలేని రుణాలు ఇస్తామని చెప్పి బడ్జెట్‌లో కేటాయింపులు తక్కువ జరిపారని ఆయన అన్నారు. తమ 9 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా గ్యాస్ ధర పెంచలేదని ఆయన గుర్తు చేశారు. మద్యాన్ని నియంత్రించాలని, బెల్టు షాపులు తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
TDP president N Chandrababu Naidu lashed out at Congress and TRS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X