వైయస్సార్ స్పూర్తికి గండి: బడ్జెట్‌పై వైయస్ జగన్

బడ్జెట్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేదిగా లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెస్తున్న పోలికలు, విధానాలు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. సంక్షేమ స్వర్ణ యుగం నుంచి రాష్ట్రాన్ని సంక్షామ యుగం వైపు నడిపిస్తున్నట్లుగా ఉందని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ఆరు పేజీల పత్రికా ప్రకటనను శనివారంనాడు విడుదల చేశారు. ఉచిత విద్యుత్తును మరిచిపోయిందని ఆయన అన్నారు. ప్రచారం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు తగలేస్తోందని ఆయన విమర్శించారు.
ప్రభుత్వం పన్నులపైనే దృష్టి పెట్టిందని, ఇంకెన్ని పన్నులు వేస్తారోనని ప్రజలు వణికిపోతున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రికి ప్రజలంటే చులకనగా ఉందని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం ఉన్నది ఎవరి కోసమని ఆయన ప్రశ్నించారు. తక్కువ నిధులు కేటాయించి 104, 108 సర్వీసులను నడిపించలేమనే సంకేతాలను ఇస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications