వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాక్షికి వచ్చిన యాడ్స్ రికార్డులు పరిశీలించిన సిబిఐ

By Srinivas
|
Google Oneindia TeluguNews

CBI Logo
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రభుత్వం నుండి ప్రకటనలు పొందిన జగతి పబ్లికేషన్స్ రికార్డులను సిబిఐ అధికారులు శనివారం పరిశీలించారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న రికార్డులతో పాటు మరికొన్నింటిని తెప్పించి వాటిని కూడా పరిశీలించారు. సాక్షి పత్రిక ప్రారంభించిన రెండేళ్లలోపే రూ.86.71 కోట్ల విలువైన ప్రకటనలు జగతికి వచ్చాయి. కొత్తగా ప్రారంభించిన పత్రికకు వెంటనే ప్రకటనలు ఇవ్వకూడదనే నిబంధన ఉన్నా అధికారులు వాటిని సడలిస్తూ ప్రకటనలు జారీ చేశారు. దీనిపై విచారించడానికి అప్పటి సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ పార్థసారథి, జాయింట్ డైరెక్టర్ రాజా బాబును ఈ నెల 21వ తేదిన సిబిఐ తమ ముందుకు పిలిపిస్తున్నట్లుగా తెలుస్తోంది.

కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ అధికారులు వైయస్ రాజశేఖర్ రెడ్డి, వైయస్ జగన్ సెల్‌ఫోన్ నెంబర్ల కాల్ లిస్టులను విశ్లేషిస్తున్నట్లు ఓ ప్రముఖ దినపత్రిక రాసిన విషయం తెలిసిందే. 2004 నుంచి 2009 వరకు వీరిద్దరూ వాడిన మూడు సెల్‌ఫోన్ నెంబర్లకు సంబంధించిన కాల్‌లిస్టును ఒక సర్వీసు ప్రొవైడర్ నుంచి సిబిఐ కోరినట్లు సమాచారం ఉందని ఆ పత్రిక రాసింది.

English summary
CBI officers studied Jagathi Publication records on adds from government to Jaganmohan Reddy's Sakshi at the time late YSR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X