హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు, గవర్నర్‌కూ..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Parthasarathi
హైదరాబాద్: శాసనసభలో మంత్రి పార్థసారథి తీరుపై తెలుగుదేశం పార్టీ బుధవారం మండిపడింది. సభలో ఆయన ప్రవర్తనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు మంత్రిపై సభా హక్కుల నోటీసును ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ నేతలు నోటీసును సాయంత్రం స్పీకర్‌కు ఇచ్చారు. పార్థసారథి తీరుపై గవర్నర్ నరసింహన్‌కు కూడా ఫిర్యాదు చేసేందుకు టిడిపి సిద్ధమవుతోంది. సభలో మంత్రి ప్రసంగం చేస్తున్న సమయంలో ఆయన చేష్టలను ఓ సిడి రూపంలో గవర్నర్‌కు అందజేయాలని భావిస్తోంది. చట్ట సభలో సాక్షాత్తూ మంత్రి ప్రవర్తన సరిగా లేదంటూ వారు గవర్నర్‌కు లేఖ రాయనున్నారు.

కాగా సభలో ఇళ్ల కేటాయింపులో అక్రమాలకు జైలుకు వెళతావని చంద్రబాబు మంత్రి పార్థసారథిని ఉద్దేశించి అన్నారు. అందుకు మంత్రి తాను తప్పు చేస్తే జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని, స్టే మాత్రం తెచ్చుకోనని అన్నారు. కృష్ణా జిల్లాలో ఇళ్ల కేటాయింపుపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కాంగ్రెసు సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దాంతో తెలుగుదేశం సభ్యులు తీవ్రంగా ప్రతిస్పందించారు. తెలుగుదేశం సభ్యుల ఆరోపణలకు మంత్రి పార్థసారథి ప్రతిస్పందిస్తూ వివరణ ఇచ్చారు. తాను జీవోను ఉల్లంఘిస్తే జైలుకు వెళ్తాను గానీ స్టే తెచ్చుకోనన్నారు. తనను అడిగినవారికి ఇళ్లు కేటాయించానని, తెలుగుదేశం పార్టీవారికి కూడా ఇచ్చానని, రచ్చబండలో దరఖాస్తు చేస్తున్నవారికి, ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకున్నవారికి ఇళ్లు ఇచ్చానని ఆయన అన్నారు. అనర్హులకు ఇళ్లు ఇస్తే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పచ్చచొక్కాలవాళ్లు ఏ విధంగా చేశారో తమకు తెలుసునని ఆయన అన్నారు.

English summary
Telugudesam Party leaders ready to complaint against minister Parthasarathi for his attitude in house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X