హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆమోదించరు: టిఆర్ఎస్‌పై బాపూజీ పరోక్ష వ్యాఖ్యలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konda Laxman Bapuji
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై ప్రముఖ స్వతంత్ర సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ శుక్రవారం మరోసారి పరోక్షంగా మండిపడ్డారు. తెలంగాణ పేరు చెప్పి పార్టీ మనుగడ కావాలని చూసే వారిని తెలంగాణ ప్రజలు ఆమోదించరని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రజలు కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం పదవులకు రాజీనామా చేసిన వారినే ఉప ఎన్నికల్లో గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా కెసిఆర్‌ను బాపూజీ పలుమార్లు విమర్శించారు. పార్టీ కోసం తప్ప తెలంగాణ పట్ల కెసిఆర్ కు చిత్తశుద్ధి లేదని గతంలో విమర్శించారు.

కాగా గురువారం టిఆర్ఎస్ నుండి బహిష్కరించబడిన యూసఫ్ అలీ కూడా కెసిఆర్ తీరుపై మండిపడ్డారు. తాను ముస్లిం అయినందుకే తనను పార్టీ నుండి బహిష్కరించారని అన్నారు. 2009లో భారతీయ జనతా పార్టీ సమావేశంలో పాల్గొన్నందుకు తాను కెసిఆర్‌ను ప్రశ్నించానని అందుకే తనపై వేటు వేశారని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసమే టిఆర్ఎస్ తెలంగాణవాదం పట్టుకుందని విమర్శించారు. కాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ యుసఫ్ అలీని టిఆర్ఎస్ గురువారం బహిష్కరించింది. ఆయన టిఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడిగా పని చేశారు. 2009లో జహీరాబాద్ నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు.

English summary
Konda Laxman Bapuji indirectly commented on Telangana Rastra Samithi today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X