చంద్రబాబు నుండి నాయకత్వాన్ని మార్చాలి: కాంగ్రెస్

తొమ్మిది గంటల చర్చలో బాబు అధిక సమయం తీసుకున్నారన్నారు. కానీ ఒక్క విషయం కూడా బయట పెట్టలేదన్నారు. బాబు తన సహచరులతో రంకెలు వేయిస్తున్నారని విమర్శించారు. అసత్యాలను సత్యాలుగా మార్చాలని బాబు ప్రయత్నాలు చేశారన్నారు. సరకు, సత్తా లేని బాబు మమ్మల్ని ఏమీ చేయలేరన్నారు. టిడిపి నాయకత్వ మార్పుపై ఆలోచించాలని మరో మంత్రి కొండ్రు మురళి అన్నారు. బలహీన వర్గాలకు చెందిన మంత్రి మోపిదేవి వెంకట రమణను లక్ష్యంగా చేసుకొని తొమ్మిది గంటల సభా సమయాన్ని వృథా చేశారన్నారు. టిడిపి తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ తీరు చూస్తుంటే బిసిలపై కక్ష కట్టినట్లుగా కనిపిస్తోందని మంత్రి పార్థసారథి విజయవాడలో అన్నారు. మరోసారి ముఖ్యమంత్రి కాలేనని తెలిసే చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని రుద్రరాజు పద్మరాజు అన్నారు.












Click it and Unblock the Notifications