వైయస్‌ను లాగుతారా: విజయమ్మను ప్రశ్నించిన ఆనం

"ఈ ప్రభుత్వం మాపై కక్షగట్టే.. సీబీఐ విచారణకు ఆదేశించింది. వైఎస్ ప్రభుత్వంలో మీరంతా మంత్రులు కాదా? దాన్ని అడ్డుకోలేరా?'' అని వైఎస్ విజయమ్మ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై ఆనం పైవిధంగా స్పందించారు. తమకు ఎవరిపైనైనా వ్యక్తిగత కోపాలు ఎందుకుంటాయని ప్రశ్నించారు. కుటుంబం కోసమో, వ్యక్తి కోసమో ప్రభుత్వం ఉండదన్నారు. సీబీఐ నివేదిక వచ్చాక చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముందో, సోనియాగాంధీ ఏం ఆమోదించారో దానిని తప్పక అమలు చేస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధి, పారదర్శక పాలనతో 2014లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications