హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎట్టకేలకు వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Nadendla Manohar
హైదరాబాద్: ఎట్టకేలకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన 16 మంది కాంగ్రెసు శాసనసభ్యులపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనర్హత వేటు వేశారు. ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యురాలు శోభానాగిరెడ్డి రాజీనామాను ఆయన ఆమోదించారు. శాసనసభ శీతాకాల సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి సానుకూలంగా ఓటు వేసిన 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు ప్రజారాజ్యం పార్టీకి చెందిన శోభా నాగిరెడ్డిలపై చర్యలు తీసుకోవాలంటూ ఆ పార్టీల నుంచి అందిన ఫిర్యాదుపై నిర్ణయం తీసుకున్నారు.

ధర్మాన కృష్ణదాసు (నరసన్న పేట), గొల్ల బాబూరావు (పాయకరావుపేట), పిల్లి సుభాష్ చంద్రబోస్ (రామచంద్రాపురం), ప్రసాదరాజు (నర్సాపురం), టి.బాలరాజు (పోలవరం), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల), సుచరిత (ప్రత్తిపాడు), బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు), గుర్నాథరెడ్డి (అనంతపురం అర్బన్), కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం), చెన్నకేశవరెడ్డి (ఎమ్మిగనూరు), మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి)లపై విప్ ధిక్కరణ 2(1)బి నిబంధన కింద అనర్హత వేటును వేశారు.

కొండా సురేఖ (పరకాల), శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), అమర్నాథ రెడ్డి (రాజంపేట) పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున వారిపై అనర్హత వేటు వేయాలంటూ గతంలోనే స్పీకర్ మనోహర్‌కు అప్పటి ప్రభుత్వ చీఫ్‌విప్ మల్లు భట్టివిక్రమార్క ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ పెండింగ్‌లో ఉండగానే - వారు విప్‌ను ధిక్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి సానుకూలంగా ఓటు వేశారు. దీంతో విప్ ధిక్కరణపై స్పీకర్‌కు మరో ఫిర్యాదు అందింది. దీంతో సురేఖ, శ్రీకాంత్ రెడ్డి, అమర్నాథ రెడ్డిలపై రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లోని 2(1)ఎ నిబంధన కింద పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు, 2(1) బి నిబంధన కింద పార్టీ విప్‌ను ధిక్కరించినందుకు అనర్హత వేటు వేశారు.

English summary
Speaker Nadendla Manohar has disqualified 16 Congress MLAs of YSR Congress president YS Jagan camp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X