హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ గెలవదన్న యాష్కీ, కిరణ్‌రెడ్డే అడ్డు అన్న వివేక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Madhu Yashki-Vivek
హైదరాబాద్/అదిలాబాద్: ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ గెలిచే అవకాశాలు లేవని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ ఆదివారం అభిప్రాయపడ్డారు. తెలంగాణలో జరగనున్న ఉప ఎన్నికల్లో రాజీనామా చేసిన అభ్యర్థులే గెలుస్తారని ఆయన జోస్యం చెప్పారు. కేంద్రం ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. భవిష్యత్తు కార్యాచరణ కోసం తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులం త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చీఫ్ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం పరకాల మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ తెలంగాణ కోసం రాజీనామా చేయలేదని వచ్చే ఉప ఎన్నికల్లో ఆమె గెలిచే అవకాశాలు లేవని అన్నారు.

కాగా తెలంగాణకు తొలి అడ్డంకి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డియేనని ఎంపి వివేక్ అదిలాబాద్ జిల్లాలో అన్నారు. సింగరేణి కొత్త ఓపెన్ కాస్ట్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఇందారంలో ఆయన ఒక్క రోజు దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు నష్టం కలిగించే విధంగా ఉన్న ఓపెన్ కాస్ట్ ప్రతిపాదనను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంపై కేంద్రానికి సిఎం తప్పుడు నివేదికలు పంపిస్తున్నారని అన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన తెలంగాణ సాధించి తీరుతామని చెప్పారు.

English summary
Nizamabad MP Madhu Yashki said that Congress will not win in bypolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X