హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దాసరి నారాయణ రావుపై వేటు, చిరంజీవికి చోటు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi-Dasari Narayana Rao
హైదరాబాద్: వచ్చే రాజ్యసభ ఎన్నికలలో ఎలా చూసినా కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు దాసరి నారాయణ రావుకు పార్టీ అధిష్టానం మొండిచేయి చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. దాసరి నారాయణ రావు స్థానంలో తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవికి రాజ్యసభను కేటాయిస్తారని వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ వాదనలు నిజమే అయ్యే అవకాశముందని అంటున్నారు. రషీద్ అల్వీ, సంజీవ రెడ్డి, కె కేశవ రావు, దాసరి నారాయణ రావు ప్రస్తుతం కాంగ్రెసు పార్టీ నుండి రాష్ట్రం తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. వీరి పదవి కాలం ఇప్పుడు ముగుస్తోంది. రషీద్ అల్వీకి ఈ సారి మన రాష్ట్రం నుండి పంపే అవకాశాలు కనిపించడం లేదు. ఇక రాష్ట్రంలోని ముగ్గురు నేతల్లో తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని సంజీవ రెడ్డి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానంలో తనకు ఉన్న పరిచయాల ద్వారా ఆయన మళ్లీ కొనసాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అధిష్టానాన్ని ప్రశ్నించేలా తెలంగాణవాదం వినిపించిన కె కేశవ రావుపై అధినాయకత్వం అసంతృప్తితో ఉన్నప్పటికీ.. తెలంగాణలో పార్టీని కాపాడే ఉద్దేశ్యంలో భాగంగానే ఆయన అలా చేశారని పలువురు ఢిల్లీ నేతల దృష్టికి తీసుకు వెళుతున్నారట. తెలంగాణ నేతలు కూడా ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఆయన పదవి కూడా పదిలంగానే ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మిగిలింది దాసరి నారాయణ రావు స్థానం ఒక్కటే. అయితే రాష్ట్రం నుండి చిరంజీవితో పాటు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి, వెంకట్రామి రెడ్డి, జివికె రెడ్డి తదితరులు క్యూలో ఉన్నారు. కడపతో పాటు సీమలో పార్టీ పటిష్టంగా ఉండాలంటే వైయస్ వివేకానందకు ఇవ్వడమే సముచితమని పలువురు భావిస్తున్నారు. అయితే హామీ మేరకు చిరంజీవిని కూడా రాజ్యసభకు పంపించవలసి ఉంటుందని అంటున్నారు. వీరికి న్యాయం చేయాలంటే ఇప్పటికే రెండుసార్లు రాజ్యసభకు వెళ్లిన దాసరి నారాయణ రావును తప్పించక తప్పదని అంటున్నారు. సాధారణంగా కాంగ్రెసులో రెండుసార్లు రాజ్యసభకు పంపిస్తారు. దాసరి ఈ సారితో రెండు పర్యాయాలు పూర్తి చేసుకుంటున్నారు. మరోవైపు చిరంజీవి కూడా దాసరి సామాజిక వర్గానికి చెందిన నేత మాత్రమే కావడం కాకుండా అదే జిల్లాకు చెందిన వ్యక్తి. దీంతో దాసరిని తప్పించి చిరంజీవికి అవకాశం ఇచ్చే అవకాశాలు ఎక్కువే ఉన్నాయని అంటున్నారు.

English summary
It seems, Dasari Narayana Rao, the two time RS member, is bound to lose the race as both Chiranjeevi and he hail from the same district and community.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X