హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులుకు తెలంగాణ రాష్ట్ర సమితి ఆదివారం రివర్స్ గేర్ వేసింది. అమరవీరుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50వేలు ఇస్తానన్న మోత్కుపల్లి ఎక్కడి నుండి తెచ్చి ఇస్తారని తెరాస నేత చంద్రశేఖర్ ప్రశ్నించారు. కూటికి గతి లేని మోత్కుపల్లి అన్ని డబ్బులు ఎక్కడి నుండి తీసుకు వచ్చి ఇస్తారని ప్రశ్నించింది. ఒక్కొక్కరికి రూ.యాభై వేల చొప్పున ఏడువందల మందికి మూడున్నర కోట్లు అవుతాయని, ఆ లెక్క కూడా తెలియని గాడిద అని ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం చనిపోయిన వారు డబ్బుల కోసం చనిపోయినట్లు చిత్రీకరించడం బాధాకరమన్నారు. తెరాసకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే మోత్కుపల్లి ఇలా చేస్తున్నారన్నారు. ఆయన ఊరకుక్కలా మొరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆయన డబ్బులు ఎక్కడి నుండి తెచ్చిస్తారో ఆధారాలతో సహా వస్తే బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. టిడిపికి ఉప ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందన్నారు.
మోత్కుపల్లి తమపై విమర్శలు మానకుంటే తెలంగాణ ద్రోహిగా మిగిలి పోతాడని హెచ్చరించారు. ఏమీ గతిలేని వెదవ మోత్కుపల్లి అని మండిపడ్డారు. రాజ్యసభ సీటు కోసం కక్కుర్తిపడే మోత్కుపల్లి రేసు కుక్కలా అరుస్తున్నాడన్నారు. మోత్కుపల్లి అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాయాలన్నారు. ఉప ఎన్నికల్లో ఒక స్థానంలో ఓడిపోయినా తమ పార్టీని మూసేసుకుంటామని ఆయన సవాల్ విసిరారు.