వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'తెలంగాణ వస్తుంది': దుమారం రేపిన 10వ తరగతి ప్రశ్న

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
కరీంనగర్ : పదో తరగతి ప్రీ ఫైనల్ తెలుగు పేపర్-2లో ఇచ్చిన ఓ ప్రశ్న తీవ్ర దుమారం రేపింది. 20 మార్కుల అబ్జెక్టివ్ పార్ట్-బిలో 11వ ప్రశ్నగా కొద్ది రోజుల్లో తెలంగాణ వస్తుంది అని ఇచ్చారు. ఈ ప్రశ్నకు వ్యతిరేకంగా వాక్యం రాయాలని పేర్కొన్నారు. అంటే ఇప్పట్లో తెలంగాణ రాదు అని విద్యార్థులు సమాధానం రాస్తేనే మార్కు లభిస్తుందన్న మాట. దీనిపై తెలంగాణవాదులు మండిపడ్డారు. సిలబస్‌లో లేని ప్రశ్నను ఎలా ఇచ్చారని నిలదీశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న విద్యార్థులు తెలంగాణని వ్యతిరేకిస్తున్నారనే విషయాన్ని ప్రభుత్వానికి తెలిపేందుకే అధికారులు ఇలా ప్రశ్నను రూపొందించారని ఆరోపిస్తున్నారు. బాధ్యులపై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాదనే భావన విద్యార్థుల్లో కలిగించడానికి ఇలాంటి ప్రశ్న తయారు చేసిన అధికారిని సస్పెండ్ చేయాలని పిఆర్టీయు, ఎపిటిఎఫ్, ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం, టిఆర్ఎస్‌యు సంఘాలు డిమాండ్ చేశాయి. కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో టిఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ప్రశ్న పత్రాలను దహనం చేశారు. కాగా ప్రశ్న పత్రాన్ని తయారు చేసిన టీచర్‌కు మెమో జారీ చేసినట్లు తెలుస్తోంది.

English summary
Telangana question created very tension in Karimnagar on saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X