వైయస్ భూపందేరం, జగన్‌కు పెట్టుబడులు: సిబిఐ

వైయస్ జగన్ జగతి పబ్లికేషన్స్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడే క్విడ్ ఫ్రోకు పునాది పడిందని, ఆరోపించింది. జగన్ కుటుంబానికి సన్నిహితుడు కాబట్టే విజయసాయి రెడ్డి టిటిడి బోర్డు డైరెక్టర్ అయ్యారని ఆరోపించింది. సండూరు పవర్‌కు చెందిన కిలాన్ టెక్నాలజీకి విజయసాయి రెడ్డి భార్య డైరెక్టర్‌గా ఉన్నారని చెప్పింది. విజయసాయి రెడ్డి ఓరియంటల్ బ్యాంక్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఓ కంపెనీకి రూ. 200 కోట్ల రూపాయల రుణం ఇప్పించారని, అదే తర్వాత జగన్‌కు చెందిన భారతి సిమెంట్స్‌గా మారిందని చెప్పింది. వైయస్ జగన్ అక్రమ వ్యాపారం 2002 - 2003లో ప్రారంభమైందని, దానికి విజయ సాయి రెడ్డే కారకుడని సిబిఐ ఆరోపించినట్లు ఓ టీవీ చానెల్ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. విజయసాయి రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్‌ను కోర్టు ఈ నెల 16వ తేదీ వరకు పొడగించింది. అలాగే ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణను కూడా 16వ తేదీకి వాయిదా వేసింది.
ఇదిలావుంటే, అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్‌ను సిబిఐ తన కస్టడీలోకి తీసుకుంది. గాలి జనార్దన్ రెడ్డిని, అలీఖాన్‌ను బెంగళూర్‌లోని కార్యాలయంలో సిబిఐ అధికారులు విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications