అనంతపురం: అనంతపురంలో కన్నకూతురు మరణించడంతో మనస్తాపానికి గురైన తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. అనంతపురంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన రాజేశ్వరి, రమణ కూతురు సాయితేజస్విని మూడు రోజుల క్రితం అపార్టుమెంటుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి రాజేశ్వరి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. దాంతో ఆమె శనివారం ఉదయం ఇంటి సమీపంలోని రైల్వే స్టేషనులో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.
పాలిటెక్నిక్ చదువుతున్న సాయితేజకు ఇటీవలి పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయి. అందుకు ఇంట్లోవాళ్లు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన సాయితేజస్విని ఆత్మహత్య చేసుకుంది. దాంతో శనివారం ఉదయం రైలు కింద పడి రాజేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. రాజేశ్వరి తల, మొండెం వేరు కావడంతో ఘటనాస్థలం బీభత్సంగా మారింది. కూతురు మరణంతో అప్పటికే తీవ్రంగా కృంగిపోయిన రమణ భార్య కూడా ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయాడు.