రాజ్యసభ రేసులో సురేష్ రెడ్డి, సోనియాతో బొత్స భేటీ

రషీద్ అల్వీ స్థానంలో కర్ణాటకకు చెందిన జాఫర్ షరీప్‌ను గానీ బీహార్‌కు చెందిన షకీల్ అహ్మద్‌ను గానీ నామినేట్ చేయాలనే ఆలోచనలో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవికి రాజ్యసభ సీటు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. మరో సీటు కోసం తీవ్రంగా పోటీ నెలకొంది. కెఆర్ సురేష్ రెడ్డితో పాటు రేణుకా చౌదరి, వైయస్ వివేకానంద రెడ్డి, వెంకట్రామి రెడ్డి వంటి నాయకులు రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. తెలంగాణకు చెందిన కె. కేశవ రావు కూడా తీవ్రంగానే ప్రయత్నాలు సాగిస్తున్నారు. తనకు సీటు ఇవ్వడం, ఇవ్వకపోవడంపైనే తెలంగాణపై అధిష్టానం ఏ విధంగా ఆలోచిస్తుందనే విషయం తెలిసిపోతుందని ఆయన అంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications