లిక్కర్ కిక్‌తో బొత్స, వోటుకు వెయ్యి బాబు: అంబటి ఫైర్

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవూరు నియోజకవర్గంలో చంద్రబాబు ఓటుకు రూ.వెయ్యి ఇవ్వలేదా అని ప్రశ్నించారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ లిక్కర్ కిక్‌లో మాట్లాడుతున్నారని అన్నారు. బొత్స నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉప ఎన్నికల్లో ఓటమికి బొత్స, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు. రానున్న ఎన్నికల్లోనూ తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. తమ పార్టీ అధినే, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తుందని, కానీ ప్రజలు వారి తప్పుడు వార్తలను నమ్మడం లేదన్నారు. తప్పుడు కథనాలు రాశారని తెలిసే జగన్‌కు పట్టం కట్టారన్నారు.












Click it and Unblock the Notifications