కిరణ్ కుమార్ రెడ్డే టార్గెట్, సిఎంగా దించడమే లక్ష్యం

Kiran kumar Reddy
హైదరాబాద్: ఏడు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను ఆసరా చేసుకుని కాంగ్రెసులోని అసమ్మతి నాయకులు నాయకులు ఒక్కసారిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై విరుచుపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డిని దించడమే లక్ష్యంగా వారు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తెలంగాణలోని ఆరు స్థానాలతో పాటు కోవూరులో కూడా కాంగ్రెసు విజయం సాధ్యం కాదనే విషయం ఎన్నికలకు ముందే అందరికీ తెలుసు. అయితే, ఆ ఎన్నికల బాధ్యతను కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్నారు కాబట్టి ఆయనే ఇప్పుడు టార్గెట్‌గా మారారు. వచ్చే 18 స్థానాలకు జరిగే ఉప ఎన్నికలను చూపి కిరణ్ కుమార్ రెడ్డిని దించేలా కాంగ్రెసు అధిష్టానంపై ఒత్తిడి తేవడమే అసమ్మతి నాయకుల ఉద్దేశంగా కనిపిస్తోంది. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు ఓటమికి పూర్తిగా కిరణ్ కుమార్ రెడ్డినే బాధ్యుడిని చేసేలా వ్యూహం అమలవుతోందని అంటున్నారు.

కాంగ్రెసు నాయకులు విడివిడిగా కిరణ్ కుమార్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ వారి విమర్శల్లో ఏకసూత్రత, ఉమ్మడి లక్ష్యం ఉందని అంటున్నారు. పథకం ప్రకారమే కాంగ్రెసు అసమ్మతి నాయకులు కిరణ్ కుమార్ రెడ్డిని లక్ష్యం చేసుకున్నారని అంటున్నారు. గురువారం ఉదయం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్యమంత్రిపై విమర్శలు సంధించడంతో ప్రారంభమై కిరణ్ కుమార్ రెడ్డిపై దాడి కొనసాగుతోంది. మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ఏకంగా తన రాజీనామా లేఖను సోనియా గాంధీకే పంపించారు. డిఎల్ రవీంద్రా రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసినట్లు ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ వ్యాఖ్యానించింది. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా తన రాజీనామా లేఖను ఆయన సోనియాకు పంపించారని అంటున్నారు.

కాగా, మాజీ మంత్రి పి. శంకరరావు సరేసరి. ఒక్కసారిగా ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిపైనే కాకుండా పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. మిగతా నాయకులు ప్రధానంగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేసుకున్నారు. కాంగ్రెసు తెలంగాణ సీనియర్ నేత కె. కేశవరావు వైయస్ రాజశేఖర రెడ్డితో పోలుస్తూ కిరణ్ కుమార్ రెడ్డిపై వాగ్బాణాలు సంధించారు. కిరణ్ కుమార్ రెడ్డిపై దాడికి వారి సంఖ్య పెరిగే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. రానున్న 18 స్థానాల ఉప ఎన్నికలను ఎదుర్కునే సమర్థత కిరణ్ కుమార్ రెడ్డికి లేదనే సంకేతాలను పార్టీ అధిష్టానానికి బలంగా పంపించడమే అసమ్మతి వర్గం ఆలోచనగా చెబుతున్నారు. ఈ పథకరచనలో భాగంగానే గురువారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ డిఎల్ రవీంద్రా రెడ్డితో సమావేశమైనట్లు చెబుతున్నారు. ఏమైనా, ఈ గండాన్ని గట్టెక్కడం ముఖ్యమంత్రికి కనాకష్టమే అవుతుందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+