శ్రీలంకకు వ్యతిరేకంగా భారత్ ఓటు, ఐరాస తీర్మానం

శ్రీలంక మానవ హక్కులను ఉల్లంఘించిందనే తీర్మానం ఐరాసలో ఆమోదం పొందింది. ఇటీవల ఎల్‌టిటిఇ అధినేత ప్రభాకరన్ కుమారుడిని శ్రీలంక సైన్యం దారుణంగా హత్య చేసిన క్లిప్పింగులు బయటకు వచ్చాయి. శ్రీలంక అరాచకాలపై ప్రపంచ దేశాలు గత కొద్ది కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. శ్రీలంకకు వ్యతిరేకంగా వ్యవహరించాలని తమిళ పార్టీలు డిఎంకె, అన్నాడియంకె నుంచి భారత ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. అమెరికా తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ రష్యా, చైనా, బంగ్లాదేశ్ ఓటేశాయి. హక్కుల ఉల్లంఘన పేరుతో ఒత్తిడి పెట్టడం సరైంది కాదని ఈ దేశాలు అభిప్రాయపడ్డాయి.












Click it and Unblock the Notifications