వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వికె సింగ్ లేఖపై రాజ్యసభలో దుమారం, ఆంటోనీ వివరణ

By Pratap
|
Google Oneindia TeluguNews

VK Singh
న్యూఢిల్లీ: ఆర్మీ చీఫ్ వికె సింగ్ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు రాసిన లేఖపై బుధవారం రాజ్యసభలో దుమారం చెలరేగింది. దానిపై వివరణ ఇవ్వాలని బిజెపి సభ్యుడు ఎం వెంకయ్య నాయుడు డిమాండ్ చేశారు. రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోనీ ఇచ్చిన వివరణతో ప్రతిపక్ష సభ్యులు సంతృప్తి చెందలేదు. ప్రతిపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేయడంతో రాజ్యసభ వాయిదా పడింది.

సైన్యంలో ఆయుధాల కొరత ఉందంటూ ఆర్మీ చీఫ్ ఇటీవల ఆర్మీ చీఫ్ వికె సింగ్ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారు. యుద్ధ ట్యాంకులు శిథిలావస్థకు చేరుకున్నాయని ఆయన అన్నారు. సైన్యం కన్నా వైమానిక దళమే బాగుందని ఆయన అభిప్రాయపడ్డారు. వికె సింగ్ రాసిన లేఖపై దుమారం చెలరేగిన నేపథ్యంలో కేంద్ర మంత్రులు చిదంబరం, ఆంటోనీ ప్రధానితో సమావేశమయ్యారు. ఆ వ్యవహారంపై చర్చించారు. దేశ భద్రత విషయంలో రాజీ పడేది లేదని సమావేశానంతరం ఆంటోనీ అన్నారు.

వికె సింగ్‌ను తొలగించాలని ఎస్పీ, జెడియులు డిమాండ్ చేశాయి. అయితే, ఆ డిమాండును బిజెపి వ్యతిరేకించింది. వికె సింగ్ వ్యవహారం క్రమశిక్షణకు సంబంధించిందని, వికె సింగ్‌ను తప్పించాలని, వికె సింగ్‌పై చర్య తీసుకోకపోతే చెడు సంప్రదాయం ఏర్పడుతుందని జెడియు నాయకుడు శివానంద్ తివారీ అన్నారు. వికె సింగ్‌ను తప్పించి, జైలులో పెట్టాలని ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్ మీడియా ప్రతినిధులతో అన్నారు. లీక్‌పై విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి.

English summary
Opinions were divided on Wednesday on the future of Army chief VK Singh with the SP and the JD(U) saying he should be sacked after his letter to the Prime Minister on shortage of ammunition in the forces came out in open but the BJP saying it did not support the demand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X