జగన్, బాబుపై విరుచుకుపడిన బొత్స, సిఎంగా కిరణే

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కమిటీ విస్తృత ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 31న జిల్లా కేంద్రాల్లో, ఏప్రిల్ 2, 3 తేదీల్లో పట్టణ, మండల కేంద్రాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తామని చెప్పారు. దివంగత ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాల వద్ద నివాళులు అర్పిస్తామని చెప్పారు. ఎన్నికలను డబ్బు మయం చేసింది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడే అని ఆరోపించారు. ఏఐసిసి పరిశీలకులు కృష్ణమూర్తి ఎప్పుడూ వచ్చే వారేనని నో సీరియస్ అని పార్టీ వ్యవహారాలపై స్పందిస్తూ అన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దోచుకుంది దాచుకోవడానికే ఉప ఎన్నికలు తెచ్చారని ఆరోపించారు. వచ్చే ఉప ఎన్నికలకు తాము అభివృద్ధి, అవినీతి, సంక్షేమ కార్యక్రమాల ప్రచారంతో వెళ్తామన్నారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగక పోవడం బాధాకరమన్నారు. విపక్షాల తీరు వల్లే సభా సమయం వృథా అయిందన్నారు. కాగ్ రిపోర్టులో ప్రభుత్వం లోపాలను ఎత్తి చూపడం సహజమేనని, వాటిని సరిదిద్దుకుంటామని చెప్పారు. 2014 వరకు ముఖ్యమంత్రిగా సిఎం కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగుతారని చెప్పారు.