చిరంజీవిపై చంద్రబాబు సెటైర్లు: తలసాని డుమ్మా

Chandrababu Naidu
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన చిరంజీవిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎప్పటిలాగే సెటైర్లు వేశారు. నిన్న ఓ సినీ యాక్టర్ పెట్టిన పార్టీ కాంగ్రెసు కంపులో కలిసిపోయిందని ఆయన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఉద్దేశించి అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తితో ఉన్న పార్టీ సీనియర్ నేత తలసాని శ్రీనివాస యాదవ్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆయన పార్టీకి దూరమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పలు ప్రాంతీయ పార్టీలు వచ్చాయని, ఆ పార్టీలు ప్రగల్భాలు పలికాయని, కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా నిలబడుతామని చెప్పాయని, కానీ తెలుగుదేశం పార్టీ మాత్రమే నిలబడగలిగిందని చంద్రబాబు అన్నారు. ప్రాంతీయ పార్టీగా ఉండి జాతీయ భావాలతో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు.

లోకసభలో ప్రతిపక్ష హోదా దక్కించుకున్న ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం ఒక్కటే అని ఆయన అన్నారు. కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు తెలుగుదేశం కారణంగానే ఏర్పడ్డాయని ఆయన అన్నారు. ఎన్టీ రామారావు హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. తెలుగుజాతికి ఎన్టీ రామారావు గౌరవాన్ని కల్పించారని ఆయన అన్నారు. తెలుగు జాతిని తాను ప్రపంచ పటం మీద నిలబపెట్టానని ఆయన చెప్పుకున్నారు. హైదరాబాదు తన ప్రభుత్వ హయాంలోనే అభివృద్ది చెందిందని ఆయన అన్నారు. తాను హైదరాబాదు రూపురేఖలు మార్చానని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిందని ఆయన విమర్శించారు. వైయస్ హయాంలోని అవినీతిపై తాము జాతీయ స్థాయిలో పోరాటం చేశామని ఆయన చెప్పారు. వైయస్ అవినీతి కూడా కాంగ్రసు వ్యవహారంలో భాగంగానే జరిగిందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+