నా పేరు వింటే సోనియా ఉలిక్కి పడి లేస్తారు: జగన్

కేవలం సోనియాకి తల వంచనందుకే తనవాళ్లను అరెస్టు చేస్తున్నారంటూ ఆగ్రహించారు. అవినీతి గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఎక్కడిదని ప్రశ్నించారు. కోవూరు ఎన్నికల్లో రూ.500 నోట్లు పంచింది చంద్రబాబు కాదా అని అడిగారు. చంద్రబాబులా తాను నీచ రాజకీయాలు చేయలేనని, చీకట్లో చిదంబరాన్ని కలవనని ఎద్దేవా చేశారు. హెరిటేజ్ సంస్థను స్థాపించడానికి చంద్రబాబుకు అంత డబ్బు ఎక్కడదని ప్రశ్నించారు. నీతి వాక్యాలు వల్లించే చంద్రబాబుకు సీబీఐతో విచారణ చేయించుకునే దమ్ముందా అని విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications