ముంబయి హోటల్లో హైదరాబాద్ అమ్మాయి ఆత్మహత్య

పోలీసుల కథనం ప్రకారం... శాంభవి హోటల్ హైవే రెసిడెన్సీలో ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయింది. దీనిని హోటల్ ఉద్యోగి గమనించాడు. ఆమె హోటల్‌లో మరికొద్ది రోజులు ఉంటారా అని అడిగేందుకు వెళ్లిన ఉద్యోగి ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకొని ఉండటాన్ని చూశాడు. శాంభవి ఆ హోటల్లో 27వ తేది మధ్యాహ్నం దిగింది. తాను ఓ ఇంటర్వ్యూ కోసం ముంబయి వచ్చినట్లు హోటల్ అధికారులకు తెలిపింది. ఆమె ఎందుకు ఈ ఆత్మహత్యకు పాల్పడిందో తెలియరాలేదని పోలీసులు చెప్పారు.
ఆమె ఉరేసుకున్న గదిలో హిందీలో తెలుగులో ఉన్న ఓ సూసైడ్ నోట్ ఉంది. అందులో తన మృతికి ఎవరూ కారకులు కారని, తన మృతదేహాన్ని తన తల్లికి అప్పగించాలని అందులో శాంభవి పేర్కొన్నది. మృతురాలి తల్లి రిటైర్డ్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారి. కాగా మృతదేహం ఆమెదేనా తెలుసుకునేందుకు కుటుంబ సభ్యులు ముంబయి వెళ్లారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. రెండు రోజులుగా ఆమె ముంబయిలో ఏం చేస్తుందో కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications