సిబిఐ టార్గెట్ వైయస్సార్: వైయస్ జగన్ సాక్షి డైలీ

కోర్టుకు రాసిన లేఖ నుంచి కోర్టుకిచ్చిన అభియోగం వరకు అంతా కుట్రేనని, ఇది తొమ్మిది నెలల కుట్ర అని సాక్షి వ్యాఖ్యానించింది. ఎన్ని నిందలు మోపినా వైయస్ వచ్చి సమాధానం చెప్పుకోలేరని, ఎల్లో మీడియాకైనా, సిబిఐకైనా అదే ధైర్యమని అన్నది. వైయస్ రాజశేఖర రెడ్డి నిండు సభలో ఎదురొడ్డి తిప్పి కొట్టిన విపక్షాల విమర్శలన్నిటినీ సిబిఐ తన చార్జిషీట్‌లో పొందుపరిచిందని చెప్పింది. ఈ కేసులో సిబిఐ తేల్చేదేమీ లేదని, ఈ కేసును ఇంకా కొన్నాళ్లు సాగదీసి బురద చల్లే కార్యక్రమాన్ని మాత్రం ఎల్లో ఫెలోల సాయంతో కొనసాగిస్తారని స్పష్టమవుతోందని, ఈ దర్యాప్తు రిమోట్ ఢిల్లీలోనే ఉందని తేలుతోందని సాక్షి దినపత్రిక దుయ్యబట్టింది.












Click it and Unblock the Notifications