జగన్ అరెస్ట్‌కు అవకాశం లేదు, చేస్తే మాత్రం...: జూపూడి

ఆస్తుల కేసులో జగన్‌ను అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో విప్లవాలు పుడతాయని, ప్రజలు తిరగబడతారని జూపూడి హెచ్చరించారు. సిబిఐ హడావుడిగా ఛార్జీషీట్ దాఖలు చేయటం వెనుక కాంగ్రెస్ పెద్దల హస్తం ఉందని సోమయాజులు ఆరోపించారు. ఒక కేసులో సిబిఐ 60 నుండి 90 రోజుల్లో ఛార్జీషీట్ దాఖలు చేయాలన్నారు. ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని, ఇక్కడ 90 రోజుల క్రితం అరెస్టు చేసిన విజయ సాయి రెడ్డి బెయిల్‌పై బయటకు రాకుండా ఉండేందుకే ఛార్జీషీట్ వేసినట్లు కనిపిస్తోందన్నారు. ఇదే కేసుకు సంబంధించిన అంశాలపై సుప్రీం కోర్టు కొందరు మంత్రులకు నోటీసులు జారీ చేసిందని, వారిపై విచారణ చేశాక దాఖలు చేయాల్సినా, సిబిఐ మధ్యలోనే ఛార్జీషీట్ దాఖలు చేయడం కోర్టు ధిక్కారం కిందికే వస్తుందన్నారు. దీని పైనా మేం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు చేస్తున్న కుట్రలను తాము న్యాయస్థానంలో, ప్రజాకోర్టులో బయటపెడతామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications