వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం పర్యటనలో ఫ్లెక్సీ వివాదం, చించేసిన కార్యకర్తలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

khammam
ఖమ్మం: ముఖ్యమంత్రి హెలిప్యాడ్ వద్ద ఆదివారం కాంగ్రెసు పార్టీ కార్యకర్తల మధ్య ఫ్లెక్సీ వివాదం ఏర్పడింది. భద్రాచలంలోని శ్రీ సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన విషయం తెలిసిందే. సిఎం కిరణ్ పేరిట ఏర్పాటు చేసిన స్వాగత బ్యానర్‌లలో దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య ఫోటో ఉండి ఇతర మంత్రుల ఫోటోలు లేకపోవడంపై పలువురు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కొందరు కార్యకర్తలు ఆ ఫ్లెక్సీలను చించి వేశారు. ఫ్లెక్సీల చించివేత విషయమై స్థానిక నాయకులు ఎస్పీ హరికుమార్, మంత్రి రాంరెడ్డి వెంకట రెడ్డికి ఫిర్యాదు చేశారు. అయితే మంత్రి వారిని సముదాయించి పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది.

కాగా ఆ తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. భద్రాద్రి రాముడికి పట్టు చీరలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆయన సతీసమేతంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సిఎం కిరణ్ భద్రాచలం ఆలయ అభివృద్ధికి ప్యాకేజ్ ప్రకటించారు. ఆలయ అభివృద్ధికి రూ.ఏడు కోట్ల రూపాయలను కేటాయించారు. తాగునీటి అవసరాల కోసం రూ.15 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. మిథిల కల్యాణ మండపంలో అభిజిత్ లగ్నంలో వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య అర్చకులు సీతారాముల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

English summary
Congress Party activists teared flexi at Bhadrachalam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X