లక్ష్మీనారాయణకు వై కేటగిరీ భద్రత, బుల్లెట్ ప్రూఫ్ కారు
State
oi-Srinivas
By Srinivas
|
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓఎంసి కేసు, ఎమ్మార్ తదితర కేసుల దర్యాప్తుకు నేతృత్వం వహిస్తున్న సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణకు ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పించింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనం షిఫ్ట్‌కు నలుగురు సిబ్బంది చొప్పున మొత్తం 12మంది గన్‌మెన్‌ను ఆయనకు కేటాయించింది. జగన్ అక్రమాస్తుల కేసులో తొలి చార్జిషీటు దాఖలై 24 గంటలు గడవకముందే లక్ష్మీ నారాయణకు భద్రతను పెంచడం గమనార్హం. పోలీసు అధికారుల్లో రాష్ట్ర పోలీస్ బాస్ అయిన డిజిపి స్థాయి వారికి మాత్రమే వై కేటగిరీ భద్రత ఉంటుంది. లక్ష్మీ నారాయణ ఐజి ర్యాంకు అధికారి మాత్రమే. అయినప్పటికీ ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించడం విశేషం.
ఎమ్మార్ అక్రమాలు, ఓబుళాపురం గనులు, జగన్ అక్రమాస్తుల కేసుతోపాటు గుజరాత్‌కు సంబంధించిన సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసుల దర్యాప్తును లక్ష్మీనారాయణ పర్యవేక్షిస్తున్నారు. జగన్ కేసుకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో కీలక ప్రాధాన్యం ఉన్న సంగతి తెలిసిందే. జెడి విచారణ జరుపుతున్న కేసుల్లో ప్రాధాన్యం దృష్ట్యా ఆయనకు భద్రత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర సర్కారు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పించాలంటూ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ను రాష్ట్ర సర్కారు ఆదివారం ఆదేశించింది. జెడి నివాసం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ఉంది. ఆయన ఇంటికి కూడా భద్రత సిబ్బందిని నియమించనున్నారు.
CBI Joint Director V.V. Lakshminarayana has been accorded 'Y' category protection after intelligence agencies found a threat perception to his life in the backdrop of chargesheets filed in high profile cases.
Story first published: Monday, April 2, 2012, 8:42 [IST]