బైపోల్స్‌లో గెలవాలి, విభేదాలు లేవనుకుంటున్నా: డిఎస్

d srinivas
న్యూఢిల్లీ: రాష్ట్ర రాజకీయాల వేడి ఢిల్లీని తాకింది. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో శాసన మండలి సభ్యుడు, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు ఆయన ఆమెతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య విభేదాలు, తెలంగాణ, ఉప ఎన్నికల అంశం వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాలపై ఆయన ఓ నివేదికను సోనియాకు ఇచ్చారు.

భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెసు ఓటమిపై ఆయన స్పందిస్తూ.. గెలుపోటములు సర్వ సాధారణం అన్నారు. ఎమోషనల్, సింటిమెంట్ దృష్ట్యా ఎన్నికలు జరిగినందునే ఓడిపోయామన్నారు. మేం ఏ నియోజకవర్గంలోనూ డిపాజిట్ కోల్పోలేదన్నారు. 2010 ఎన్నికలకు ఇప్పటికి తాము ఓట్ల శాతం పెంచుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ బలహీనపడలేదన్నారు. క్రమంగా పుంజుకుంటుందని చెప్పారు. పార్టీలో ఏమైనా సమస్యలు ఉంటే చర్చించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు.

రానున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ గెలిచి తీరాలి అన్నారు. బొత్స, కిరణ్ మధ్య విభేదాలు తనకు సంబంధించిన అంశం కాదని చెప్పారు. వారిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవనే తాను భావిస్తున్నానని ఒకవేళ ఉన్నప్పటికీ కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ సయోధ్య కుదుర్చాల్సి ఉందన్నారు. ఏ ఎన్నికల్లో 294 సీట్లకు అన్ని సీట్లు ఎవరూ గెలవలేరన్నారు. పార్టీ వ్యవహారాలపై సోనియాతో మాట్లాడినట్లు చెప్పారు.

ముఖ్యమంత్రి మార్పు గురించి ఊహాగానాలపై ఆయన దాటవేశారు. తాను సోనియా గాంధీని కలవగానే తెలంగాణ సమస్య పరిష్కారం కాదన్నారు. పరిష్కారం కోసం అధిష్టానం, యుపిఏ ప్రభుత్వం, కోర్ కమిటీ ఉందని చెప్పారు. ఇవి ఆ లెవల్లో తీసుకునే నిర్ణయమన్నారు. తెలంగాణపై పార్టీ సీరియస్‌గా ఆలోచిస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+