జగన్‌కు మమ్మల్ని ఎదుర్కునే దమ్ము లేదు: బొత్స

తమ పార్టీని ఎదుర్కునే సత్తా వైయస్ జగన్‌కు లేదని, తాము బలంగా ఉన్నామని ఆయన అన్నారు. కోర్టులో కేసు ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేకపోతున్నామని ఆయన అన్నారు. వచ్చే ఉప ఎన్నికలను ప్రభుత్వానికి రెఫరెండంగా భావించలేమని ఆయన అన్నారు. వచ్చే ఉప ఎన్నికల ఫలితాలను బట్టి కార్యాచరణ రూపొందించుకుంటామని ఆయన చెప్పారు.
మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలకు తాము బాధ్యత వహిస్తామని ఆయన చెప్పారు. అయితే తమ వెనక జరిగే లావాదేవీలతో, అవినీతితో తమకు సంబంధం లేదని ఆయన అన్నారు. ఒకవేళ తాము తప్పు చేసినట్లు రుజువైతే బాధ్యత వహిస్తామని ఆయన చెప్పారు. తప్పు చేసినట్లు రుజువైతే తల వంచుకుని సిగ్గుపడుతూ బాధ్యత వహిస్తామని ఆయన చెప్పారు. అవినీతి కార్యక్రమాలతో తమకు సంబంధం లేదని ఆయన అన్నారు.
త్వరలో జరిగే 18 శాసనసభా స్థానాల్లో తమ పార్టీ గెలిస్తే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. ముళ్ల కిరీటం పెట్టేవారికి ఓటేయవద్దని ఆయన ప్రజలను కోరారు.












Click it and Unblock the Notifications