చిరంజీవి ప్రతిపక్ష పాత్ర, ముఖ్యమంత్రికి లేఖాస్త్రం

విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సి) నిర్ణయం మేరకే చార్జీలు పెరిగాయని చెప్తే ప్రజలు విశ్వసించే స్థితిలో లేరని ఆయన అన్నారు. విద్యుత్ చార్జీల పెంపు కొన్ని వర్గాలకు లాభం చేకూర్చేలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చేందుకు మాత్రమే ఈ లేఖ రాస్తున్నట్లు ఆయన తెలిపారు. డిస్కంల ప్రతిపాదనలను మరిచిని నియంత్రణ మండిలి కొన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరించిందనే ఆరోపణలు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చే ఉంటాయని ఆయన అన్నారు.
ప్రజలకు అవసరమైన కేటగిరీ - 5లో చార్జీలను పెంచి ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు తగ్గించడం వెనక కొందరి చేతివాటం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని ఆయన గుర్తు చేశారు. ఈఆర్‌సి నిర్ణయాలను సమీక్షించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. విద్యుత్ కోతలు ఈ ఏడాది ఎక్కువగానే ఉన్నాయని కూడా ఆయన అన్నారు. కోతల వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, లఘ, మధ్య తరహాల పరిశ్రమల కార్మికులు ఉపాధి కరువై రోడ్డున పడుతున్నారని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రిని కలిసి నేరుగా మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ చిరంజీవి లేఖ రాయడంలోని ఆంతర్యంపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇటీవలి కాలంలో చిరంజీవిని కాంగ్రెసు నాయకులు విస్మరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ సమావేశాలకు ఆహ్వానించే విషయంలో, ఆయనను సంప్రదించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఉంది. ఈ స్థితిలోనే చిరంజీవి ముఖ్యమంత్రికి లేఖాస్త్రం సంధించినట్లు తెలుస్తోంది. నిజానికి, చిరంజీవి అలా లేఖాస్త్రం సంధించడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications