ఐపిఎల్ టచ్: ఎద్దుల రంకెలు, చీర్ గర్ల్స్ చిందులు

Anantapur District
అనంతపురం: జిల్లాలో ఎద్దుల పోటీకి ఐపిఎల్ టచ్ ఇచ్చారు. అనంతపురం జిల్లాలో ఎద్దుల పోటీలు నిర్వహిస్తున్నారు. అయితే నిర్వాహకులు ఎద్దుల పోటీని వీక్షించే ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఇంకో వైపు చీర్ గర్ల్స్ చిందులు కూడా ఏర్పాటు చేశారు. పోటీలు నిర్వహించే సమయంలో పోటీకి పోటీకి మధ్య సమయం తీసుకుంటుంది. కాబట్టి ఆ సమయంలో ప్రేక్షకుల్లో నిస్తేజం రాకుండా చీర్ గర్ల్స్‌తో డాన్సులు ఏర్పాటు చేశారు.

కాగా అనంతలో తొలిసారిగా ఎద్దుల పందాలు జరుగుతున్నాయి. రూ.60 లక్షలతో దీనిని నిర్వహిస్తున్నారు. ఈ పోటీలలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుండి వచ్చారు. సుమారు 200 జట్లు పోటీలో పాల్గొన్నాయి. ఎద్దుల పోటీలతో పాటు చీర్ గర్ల్స్ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొత్తగా ఉండటంతో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి, జిల్లా కాంగ్రెసు పార్టీ సీనియర్ నేతలు జెసి దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జెసి ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన ఒంగోలు గిత్తల రైతులను ప్రోత్సహించేందుకే పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోటీల నిర్వహణలో ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదన్నారు.

పోటీలకు సీమాంధ్రతో పాటు తెలంగాణ నుండి కూడా మంచి స్పందన ఉందన్నారు. అన్ని పార్టీల వారు పాల్గొంటున్నారన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒంగోలు గిత్తలకు క్రమంగా మనుగడ లేకుండా పోతుందని, వాటిని ప్రోత్సహించే ఉద్దేశ్యంలో భాగమే ఇది అన్నారు. మరో కోణం ఇందులో లేదని చెప్పారు.

ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపేందుకే చీర్ గర్ల్స్ డాన్సులు అని జెసి ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ఏపిఎల్‌లో చీర్ గర్ల్స్‌ను పెట్టవచ్చు కానీ మేం పెట్టవద్దా అని ప్రశ్నించారు. ఐపిఎల్‌లో ఇటీవలే చీర్ గర్ల్స్‌ను పెడుతున్నారని, కానీ తాను ఇరవయ్యేళ్ల క్రితమే క్రికెట్ ఆటలో దీనిని ప్రవేశ పెట్టానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+