సిఎంకు 325కోట్లు ముట్టాయని బొత్స చెప్పారు: రేవంత్

ప్రభుత్వ సంస్థల నుంచి తక్కువ ధరకు బొగ్గును దిగుమతి చేసుకున్నామన్న విజయానంద్ వాదన సరికాదన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ సంస్థలను కేవలం ముసుగుగా వాడుకొన్నారని ఆరోపించారు. గుజరాత్ కంపెనీ ఒకటి బొగ్గును సరఫరా చేసిందని, అక్రమాలకు పాల్పడుతున్న చరిత్ర ఆ కంపెనీకి ఉన్నదని చెప్పారు.
ఈ విషయాన్ని గుజరాత్ అధికారులు తమ నివేదికల్లో ద్రువీకరించారని పేర్కొన్నారు. ఈ కంపెనీకి కాంగ్రెస్ నాయకులు, కొందరు పెద్దల అండదండలున్నాయన్నారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రూ.325 కోట్లు ముట్టాయని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్వయంగా తమ పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారని ఆయన చెప్పారు.
నిజంగా విదేశాల నుంచే బొగ్గును తెప్పించి ఉంటే ఏ ఓడరేవుకు తెప్పించారని, థర్మల్ ప్లాంట్లకు ఎలా రవాణా చేశారనేది చెప్పాలని ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బొగ్గు దిగుమతిలో జెన్‌కోకు తీవ్ర నష్టం వస్తోందని కాగ్ కూడా పేర్కొన్నందున విచారణ జరపాలని ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications