తారా చౌదరి నోట మళ్లీ అదే మాట, చంచల్‌గూడ జైలుకు

ఈ సందర్భంగా ఆమెను విలేకరులు ప్రశ్నించారు. తారా మళ్లీ పాత పాటే పాడింది. తాను ఏ తప్పు చేయలేదని ఆమె విలేకరులతో చెప్పింది. తనను ఉద్దేశ్య పూర్వకంగా కుట్రతో ఇరికించారని పేర్కొంది. కాగా సోమవారం బంజారాహిల్స్ పోలీసులు తారా చౌదరిని తమ కస్టడీకి తీసుకునే సమయంలోనూ ఆమె ఇదే చెప్పింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనను కుట్ర చేసి ఇందులో ఇరికించారని పేర్కొంది.
తాను బెయిల్ పైన విడుదలయి వస్తానని చెప్పింది. అప్పుడు అందరి గుట్టు విప్పుతానని హెచ్చరించింది. తనను కొందరు రాజకీయ నాయకులు వాడుకొని వదిలేశారని ఆరోపించింది. తనకు పోలీసుల విచారణపై నమ్మకం లేదని సిబిఐ విచారణ జరిపిస్తే అన్నీ వెలుగులోకి వస్తాయని తెలిపింది. తాను హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి, డిజిపిని కలిసి సిబిఐ విచారణ కోరతానని తెలిపింది.
కాగా పోలీసులు తారా చౌదరిని నాలుగు రోజుల పాటు విచారించారు. నాంపల్లి కోర్టు నాలుగు రోజుల పోలీసుల కస్టడీకి తారాను అప్పగించింది. ఆ తర్వాత కోర్టులో ప్రవేశ పెట్టాలని ఆదేశించింది. దీంతో గురువారం వరకు ఆమెను విచారించిన పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరు పర్చారు. అనంతరం కోర్టు ఆమెకు 27వ తేది వరకు రిమాండ్ విధించింది.












Click it and Unblock the Notifications