కెసిఆర్ కూతురు కవిత దీక్ష: జెపికి చేదు అనుభవం
హైదరాబాద్: శాసనసభ ఆవరణలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం దీక్ష ప్రారంభించారు ఈ దీక్ష శిబిరానికి వచ్చిన లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయకు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద కవిత చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపేందుకు ఆయన వచ్చారు.
దీక్షా స్థలిలో ప్రసంగించి తిరిగి వెళ్తుండగా ఓ యువకుడి జయప్రకాష్ నారాయణను అడ్డుకున్నాడు. ఆత్మహత్యలు జరుగుతున్నా తెలంగాణకు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని ఆయన యువకుడు జెపిని నిలదీశాడు. నిర్ణయాలు తీసుకోలేని అసమర్థ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని, కేంద్రాన్ని పాలించడం దారుణమని జెపి అన్నారు. తెలంగాణ కోసం ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన తెలంగాణ యువతను కోరారు.

అంబేడ్కర్ ఒక కులానికో మతానికో చెందినవాడు కాడని లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తాము తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తామని జెపి గురువారం పార్టీ సమావేశానంతరం చెప్పారు. రాష్ట్ర విభజన సామరస్యపూర్వకంగా జరిగితే తాము అంగీకరిస్తామని కూడా ఆయన చెప్పారు.
కాగా, గతంలో జెపిపై శానససభ ఆవరణలో తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ కారు డ్రైవర్ మల్లేష్ చేయి చేసుకున్నాడు. మీడియాతో మాట్లాడి వెళ్లిపోతున్న జెపిపై అతను దాడి చేశాడు. ఇది అప్పట్లో పెద్ద దుమారం రేపింది.












Click it and Unblock the Notifications