తారా చౌదరి కేసు: రిటైర్డ్ ఐపియస్ బెయిల్ పిటిషన్

Tara Chowdhary
హైదరాబాద్: వ్యభిచారం రాకెట్ కేసులో అరెస్టయిన వర్ధమాన నటి తారా చౌదరి కేసులో ఓ రిటైర్డ్ ఐపియస్ ఆఫీసర్ ముందస్తు బెయిల్‌కు కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు 23వ తేదీకి వాయిదా వేసింది. తారా చౌదరి నివాసంలో రిటైర్డ్ ఐపియస్ అధికారి ఎం. భాస్కర్ విజిటింగ్ కార్డు పోలీసులకు చిక్కింది. దీంతో పోలీసులు తనను అరెస్టు చేసే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఆయన ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

తారా చౌదరి నివాసంలో తన విజిటింగ్ కార్డు దొరికినంత మాత్రాన పోలీసులు తనను ఎలా విచారిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. తారా చౌదరి ఎవరో తనకు తెలియదని, తారా చౌదరితో తనకు సంబంధం లేదని ఆయన చెప్పారు. తనకు రెండు సార్లు గుండె ఆపరేషన్ జరిగిందని, పోలీసు విచారణను ఎదుర్కునే ఓపిక, శక్తి తనకు లేవని ఆయన అన్నారు.

తారా చౌదరిని అరెస్టు చేసిన తర్వాత ఆమె నివాసం నుంచి సిడిలను, పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల సమయంలోనే భాస్కర్ నివాసంలో విజిటింగ్ కార్డు దొరికినట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో భాస్కర్‌ను విచారించాల్సి ఉందని పోలీసులు అన్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో భాస్కర్ ముందస్తు బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తారా చౌదరికి వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు, పోలీసు అధికారులతో సంబంధాలున్నట్లు వార్తలు వచ్చాయి. భాస్కర్ తారా చౌదరితో మాట్లాడిన ఆడియో సిడీలు కూడా దొరికినట్లు అనుమానిస్తూ వార్తలు వచ్చాయి. దానికి సంబంధించిన విషయాలను పోలీసులు బయటపెట్టడం లేదని వార్తలు వచ్చాయి. పోలీసు విచారణలో తారా చౌదరి పలు విషయాలు వెల్లడించినట్లు సమాచారం. తారా చౌదరితో సంబంధాలున్నట్లు చెబుతున్న ప్రముఖుల పేర్లను పోలీసులు వెల్లడించడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+